లండన్: వింబుల్డన్ 2021 మిక్స్ డ్ డబుల్స్ లో భారత స్టార్ ప్లేయర్లు సానియా మిర్జా-బొపన్న జోడీ మూడో రౌండ్ లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన రెండో రౌండ్ మ్యాచుల్లో బ్రిటన్ కు చెందిన మెక్ హగ్, ఎమిలీ వెబ్లీ-స్మిత్ లతో సానియా-బొపన్న జోడీ తలపడింది. స్కోరు 6-3, 6-1 తేడాతో రెండు వరుస సెట్లు గెలిచి ఘన విజయం సాధించారు. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరువురు సమన్వయంతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రత్యర్థులకు ఒక్క సారి కూడా పైచేయి సాధించే అవకాశం ఇవ్వలేదు. చాలా కాలం గ్యాప్ తో టోర్నీలో అడుగుపెట్టిన సానియా పెళ్లికి మునుపటి పెర్ పామెన్స్ ను గుర్తు చేస్తూ రెచ్చిపోయింది. మహిళ డబుల్స్ రెండో రౌండ్ లో ఓడిపోయిన కసితో ఆడి మిక్స్ డ్ డబుల్స్ లో సానియా ముందంజ వేసింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో వీరి జోడి సెమీ ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే.

