V6 News

వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత ఆష్లే బార్టీ

వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత ఆష్లే బార్టీ

లండన్: ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బార్టీ వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చెక్‌ రిపబ్లిక్ కు చెందిన ఫ్లిస్కోవాపై 6-3, 6-7(4/7), 6-3 తేడాతో ఆష్లే బార్టీ గెలుపొందింది. బార్టీకి కెరీర్ లో  ఇది రెండో టైటిల్‌ కాగా వింబుల్డన్‌ గెలవడం ఇదే తొలిసారి. తొలి సెట్ ను సునాయసంగా గెలిచిన బార్టీ రెండో సెట్లో చెమటోడ్చి ఒక్క సెట్ తేడాతో నెగ్గింది. దీంతో అనివార్యంగా మూడో సెట్ నిర్వహించగా.. అనూహ్యంగా ప్లిస్కోవా పై చేయి సాధించినా చివరకు బార్టీనే ఆధిపత్యం సాధించి టోర్నీని కైవసం చేసుకుంది. దీంతో కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన ప్లిస్కోవాకు నిరాశ తప్పలేదు.

మరో వైపు వింబుల్డన్ బాలుర విభాగంలో ఇండో-అమెరికన్ ఆటగాడు సమీర్ బెనర్జీ ఫైనల్ కు చేరాడు. ఇవాళ జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో వేయన్ బర్గ్పై బెనర్జీ  గెలుపొంది ఫైనల్ కు దూసుకెళ్లాడు.