జులై నాటికి రోజుకు కోటి వ్యాక్సిన్లు

జులై నాటికి రోజుకు కోటి వ్యాక్సిన్లు

దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ నెమ్మదిగా కొనసాగుతోంది. అయితే.. జూలై మధ్య నాటికి గానీ, ఆగస్టు మొదటి వారం నాటికి గానీ ప్రతిరోజు కోటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని ICMR చీఫ్ బలరాం భార్గవ అన్నారు. ఈ ఏడాది చివరికి 108 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని..దీనికోసం వ్యాక్సిన్ లభ్యత రెట్టింపు చేసేందుకు కృషి చేస్తోందని తెలిపారు.

ఇప్పుడిప్పుడే దేశంలో కొత్త వ్యాక్సిన్ తయారీదార్లు వస్తున్నారని తెలిపారు. ఇక పై దేశంలో కరోనా వ్యాక్సిన్ కు కొరత వచ్చే అవకాశం లేదని తాను అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు బలరాం భార్గవ. కరోనా పరీక్షల సంఖ్యను పెంచడం, కఠిన కంటైన్మెంట్ నిబంధనలు సెకండ్ వేవ్ ను కట్టడి చేయడంలో సాయపడ్డాయన్నారు. అయితే.. దీర్ఘకాలం..కేవలం వీటిపైనా ఆధారపడడం అవివేకం అవుతుందన్నారు.