జూబ్లీహిల్స్ బైపోల్ పై కాయ్ రాజా కాయ్..కాంగ్రెస్ పై రూ.1000 కోట్ల బెట్టింగ్.!

జూబ్లీహిల్స్ బైపోల్ పై  కాయ్ రాజా కాయ్..కాంగ్రెస్ పై రూ.1000 కోట్ల  బెట్టింగ్.!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ పై జోరుగా బెట్టింగ్స్ సాగుతోంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్,బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో  వందల కోట్ల బెట్టింగ్ జరుగుతోంది.   ఏ పార్టీ గెలుస్తుందనే దానిపైనే జోరుగా పందాలు జరుగుతున్నాయి. 

గె  ఐపీఎల్ బెట్టింగులతో సమానంగా సాగుతుండటం గమనార్హం. గెలుపు, ఓటములతోపాటు అభ్యర్థి సాధించే మెజార్టీపైనా, సెకండ్ ప్లేస్ పై కూడా పందెం రాయులు బెట్టింగులు కాస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాలుగు లక్షల మంది ఓటర్లున్నా అందులో 50 శాతం మందే అభ్యర్థుల తలరాతలు మార్చవచ్చని నేతలు విశ్వసిస్తున్నారు.

తెలంగాణలో కంటే ఏపీలోనే జూబ్లీహిల్స్ పై ఎక్కువగా బెట్టింగ్ జరుగుతోంది.  విజయవాడు, గుంటూరు బెట్టింగ్ రాయుళ్లు హైదరాబాద్ లోనే మకాం వేశారు. సర్వేలను నమ్మకుండా సొంత  సమాచారంతో బెట్టింగ్స్ కాస్తున్నారు.  హైదరాబాద్ లోని తమ వాళ్లతో మాట్లాడి పందాలు కాస్తున్నారు.  

గ్రౌండ్ లెవల్ ఇన్ఫర్మేషన్ తో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు బెట్టింగ్ రాయుళ్లు.జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందని బెట్టింగ్ కాస్తున్నారు. వాట్సప్ గ్రూప్స్ , టెలిగ్రామ్, యాప్స్ ల ద్వారా బెట్టింగ్ పెడుతున్నారు.  ఇప్పటికే రూ.500 కోట్ల బెట్టింగ్ దందా జరిగినట్టు టాక్ వినిపిస్తోంది. పోలింగ్ నాటికి వెయ్యి కోట్లకు పైగా బెట్టింగ్ జరిగే అవకాశం  ఉన్నట్టు సమాచారం.

కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీచేస్తున్నారు.  నవంబర్ 11న పోలింగ్..14న కౌంటింగ్ జరగనుంది.