టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ..పరీక్షకు 4,675 మంది హాజరు

టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ..పరీక్షకు 4,675 మంది హాజరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలు మొదలయ్యాయి. తొలిరోజు శుక్రవారం ఫస్ట్ లాంగ్వేజీ ఎగ్జామ్ జరిగింది. ఈ పరీక్షలకు 6,086 మంది రిజిస్టర్ చేసుకోగా, 4,675 (76.82%) మంది పరీక్షకు హాజరయ్యారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ లింగయ్య తెలిపారు. మరో 1,411 మంది పరీక్షలు రాయలేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 124  సెంటర్లను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మికంగా తనిఖీ చేశాయని పేర్కొన్నారు.