118 జీఓను సవరించి న్యాయం చేయాలి..ఎల్బీనగర్​లో బాధితుల ర్యాలీ

118 జీఓను సవరించి న్యాయం చేయాలి..ఎల్బీనగర్​లో బాధితుల ర్యాలీ

ఎల్బీనగర్, వెలుగు :  బీఆర్ఎస్​ప్రభుత్వం తీసుకొచ్చిన 118జీఓతో తమకు న్యాయం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని బాధితులు వాపోయారు. శనివారం ఎల్బీనగర్​సెగ్మెంట్​నాగోలు పరిధిలోని శ్రీసాయినగర్ కాలనీలో నిరసన ర్యాలీ తీశారు. వెంటనే జీఓను సవరించాలని కోరారు. ఈ సందర్భంగా కాలనీ సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు దయానందరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్​ప్రభుత్వం ఎన్నికల్లో ఓట్ల కోసం 118 జీఓను తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఎల్బీనగర్ నియోజకవర్గలోని 44 కాలనీల్లోని ఇండ్ల క్రమబద్ధీకరణ కోసం 118 జీఓ ద్వారా డబ్బులు చెల్లించి కన్వేయన్స్ డీడ్ ద్వారా రిజిస్టర్​ అయినట్లు తెలిపారు. 

కన్వేయన్స్ డీడ్​రిజిస్టర్డ్ సాంప్ పేపర్ మీద కాకుండా, తెల్ల కాగితంపై ఇవ్వడం ద్వారా ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో స్థలాలు కొని, ఇండ్లు కట్టుకుంటే రికార్డుల్లో ఆక్రమించుకుంట్లు చూపించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. 118 జీఓతో జరిగిన నష్టాన్ని గుర్తించి, తమకు న్యాయం చేయాలని కోరారు. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాగోలు డివిజన్  అధ్యక్షుడు మంజులారెడ్డి, సాయినగర్ కాలనీ సీనియర్ సిటిజన్ ఫోరం ఫైనాన్స్ సెక్రటరీ శ్రీనివాసాచార్యులు, నాయకులు నాగేంద్రప్రసాద్, లాలయ్య గౌడ్, సత్యనారాయణరెడ్డి, సూర్యప్రకాశ్​రెడ్డి, నరసింహారెడ్డి వీరాంజనేయులు, అశోక్ కుమార్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.