న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో రూ.4,883 కోట్ల అంచనా వ్యయంతో 118 ఆర్‌వోబీ, ఆర్‌యూబీ పనులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. 2014 నుంచి 2026 మే వరకు రాష్ట్రంలో 520 ఆర్‌వోబీ, ఆర్‌యూబీల నిర్మాణం పూర్తయిందన్నారు.
ట్రాక్ పునరుద్ధరణతో పాటు 'కవచ్' ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అమలులో తెలంగాణ సెక్షన్లు భాగమయ్యాయని పేర్కొన్నారు. రాజ్యసభలో ఎంపీ బి. పార్థసారధి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా రైల్వే సేఫ్టీ బడ్జెట్ 2026-27 నాటికి రూ.1,20,389 కోట్లకు పెరిగిందని, దీనివల్ల తీవ్ర రైలు ప్రమాదాలు 88 శాతం తగ్గాయని వెల్లడించారు.
