బర్త్‌డే రోజే సూసైడ్ చేసుకున్న మైనర్ బాలుడు

బర్త్‌డే రోజే సూసైడ్ చేసుకున్న మైనర్ బాలుడు

పుట్టినరోజును అందరూ జరుపుకోవాలనుకుంటారు. పిల్లలైతే మరీనూ.. స్నేహితులను, చుట్టాలను పిలిచి అందరి ముందు కేక్ కట్ చేయాలని ఆశపడుతుంటారు. అలాగే బర్త్ డే చేసుకుంటున్న ఒక బాలుడికి బర్త్‌డేనే డెత్ డే అయింది. ఈ దారుణ ఘటన నోయిడా సెక్టార్‌లో నవంబర్ 24న జరిగింది. స్థానికంగా నివసించే ఒక 12 ఏళ్ల బాలుడు తన పుట్టినరోజున ఆత్మహత్య చేసుకున్నాడు. ‘తన పుట్టినరోజున ఒక పిల్లవాడు ఆత్మహత్య చేసుకొని మరణించాడని మాకు సమాచారం వచ్చింది. బాలుడిని అతని కుటుంబ సభ్యులు మందలించడంతో.. మనస్థాపంతో బాలుడు సూసైడ్ చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని అదనపు డిప్యూటీ కమిషనర్ రణవిజయ్ సింగ్ తెలిపారు.

For More News..

తెలంగాణలో కొత్తగా 862 కరోనా కేసులు

21 ఏండ్లలో ఒక్క ప్రమోషన్‍ ఇయ్యలె.. రిటైర్మెంటప్పుడు కూడా అదే పోస్ట్ , అదే జీతం

పరీక్ష హాల్‌లోకి రానీయలేదని స్టూడెంట్​ సూసైడ్