V6 News

హైదరాబాద్ లో రీల్స్ చేస్తూ బిల్డింగ్ పైనుంచి జారిపడి బాలుడు మృతి..

హైదరాబాద్ లో రీల్స్ చేస్తూ బిల్డింగ్ పైనుంచి జారిపడి బాలుడు మృతి..

రీల్స్.. మందు కంటే డేంజరస్ వ్యసనంగా మారిపోయింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రీల్స్ పిచ్చిలో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. గంటలు తరబడి రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేసేవారు కొందరైతే... రీల్స్ కోసం రిస్క్ చేసి ప్రాణాల మీదకు తెచుకునేవారు మరికొందరు. రీల్స్ కోసం రిస్క్ చేసి మరో బాలుడు ప్రాణాలు వదిలాడు.హైదరాబాద్ లో దారుణం జరిగింది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ బిల్డింగ్ పై నుంచి జారిపడి బాలుడు మృతి చెందాడు. ఏప్రిల్ 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

హైదరాబాద్ లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ గాంధీ బొమ్మ బస్తీకి చెందిన 14 ఏళ్ళ బాలుడు మితున్ రీల్స్ చేస్తూ బిల్డింగ్ పైనుంచి పడి మృతి చెందాడు. ఏప్రిల్ 5న జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మిథున్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతి చెందాడు.

►ALSO READ | మద్యానికి బానిసై డబ్బుల కోసం తండ్రి వేధింపులు... కొడుకే ఇటుకతో తల పగలకొట్టి..

మితున్ బిల్డింగ్ మీద నుంచి కిందపడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాలుడి మృతదేహాన్ని బీహార్ కు తరలిస్తున్నారు బంధువులు. మితున్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.