బైక్ పై 141 చలానాలు..రూ. 33000 వేల జరిమానా

బైక్ పై 141 చలానాలు..రూ. 33000 వేల జరిమానా

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గురువారం వాహనాల తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్ సమీపంలో అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు జగదీష్ మార్కెట్ దగ్గర తనిఖీ చేస్తుండగా..అప్పుడే అటుగా వచ్చిన ap13ab1474 నంబర్ ఉన్న ఓ బైక్ ను ఆపి తనిఖీ నిర్వహించారు.  లైసెన్స్ తో రూల్స్ ప్రకారం వెహికిల్ కు ఉండాల్సిన అన్ని సర్టిఫికెట్లను పరిశీలించారు. అయితే ఆ బైక్ పై 141 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. 141 చలాన్లకు..33000  రూపాయలు చెల్లించాల్సి ఉంది. మొత్తం చలానా చెల్లించకుండా పెండింగ్ లో ఉండటంతో వాహనాన్ని సీజ్ చేశారు. ఆ బైక్ ఫిరోజ్ అనే వ్యక్తికి చెందింది.