బస్ డిపోల దగ్గర 144 సెక్షన్

బస్ డిపోల దగ్గర 144 సెక్షన్

హైదరాబాద్ పరిధిలోని అన్ని బస్ డిపోల వద్ద ఈ రోజు 144 సెక్షన్ ప్రకటిస్తున్నట్లు కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ చేస్తున్న సమ్మె 43వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా ఆర్టీసీ జేఏసీ నేతలు ఈ రోజు ‘బస్ రోకో’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ‘బస్ రోకో’ కార్యక్రమం వల్ల వ్యాపారాలకు, విద్యార్థులకు చాలా నష్టం వాటిల్లుతుంది. అందువల్ల ఏ బస్ డిపో దగ్గర నలుగురు కన్నా ఎక్కువ మంది గుమ్మికూడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అన్ని డిపోల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఆర్టీసీ ప్రధాన డిమాండైన విలీనం డిమాండ్‌ను ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లు జేఏసీ నేతలు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. విలీనం డిమాండ్ కాకుండా మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వం చర్చ జరపాలని జేఏసీ నేతలు కోరుతున్నారు. అయినా ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు.