సైబరాబాద్​లో​ 16 మంది ఇన్ స్పెక్టర్ల బదిలీ

సైబరాబాద్​లో​ 16 మంది ఇన్ స్పెక్టర్ల బదిలీ

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ లో 16 మంది ఇన్ స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సైబరాబాద్​ సీపీ అవినాష్​ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరో ముగ్గురు ఇన్​స్పెక్టర్​లను హైదరాబాద్​ మల్టీ జోన్–​2కు ట్రాన్స్​ఫర్​ చేశారు. బాలానగర్ ఎస్ వోటీ జోన్ ఇన్ స్పెక్టర్ గా ఉన్న రాహుల్ దేవ్  అల్వాల్ ఇన్ స్పెక్టర్ గా, సీసీఎస్ రాజేంద్రనగర్ ఇన్ స్పెక్టర్ గా ఉన్న బాలరాజు శంషాబాద్ ఎయిర్ పోర్టు ఇన్ స్పెక్టర్ గా నియమితులయ్యారు. కేపీహెచ్ బీ ట్రాఫిక్ పీఎస్ ఇన్ స్పెక్టర్ గా ఉన్న నర్సింహారావును కొత్తూరు ఇన్ స్పెక్టర్ గా, ఏహెచ్ టీయూ ఇన్ స్పెక్టర్ గా ఉన్న పవన్ కుమార్ రెడ్డిని మొయిన్ బాద్ కు బదిలీ చేశారు. 

ఎస్ బీ(స్పెషల్ బ్రాంచ్) ఇన్​స్పెక్టర్​ ఉపేందర్​రావు బాచుపల్లి ఇన్​స్పెక్టర్​గా, మాదాపూర్​డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ వెంకటయ్య కేపీహెచ్ బీ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ గా ట్రాన్స్ ఫర్ అయ్యారు. సైబరాబాద్ ట్రాఫిక్ అడ్మిన్ గా ఉన్న నాగిరెడ్డి బాలానగర్ డీఐగా బదిలీ కాగా,  మాదాపూర్ ఎస్ వోటీ ఇన్ స్పెక్టర్ శివకుమార్ సైబరాబాద్ కమిషనరేట్ కు అటాచ్ అయ్యారు. మొయినాబాద్ టీఎస్పీఏ ఇన్ స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డిని బాలానగర్ ఎస్ వోటీ ఇన్ స్పెక్టర్ గా బదిలీ చేశారు. బాలానగర్, సనత్​నగర్​ డీఐగా ఉన్న నవీన్​కుమార్​ను​ స్పెషల్ బ్రాంచ్​కు, సీపీవోలో ఉన్న విజయ్ వర్దన్​మాదాపూర్ ఎస్ వోటీ ఇన్ స్పెక్టర్ గా బదిలీ అయ్యారు. 

నార్కొటిక్స్ ఆపరేషన్స్ ఇన్ స్పెక్టర్ గా ఉన్న వెంకట్ రెడ్డి మేడ్చల్ డీఐగా, బాచుపల్లి ఇన్ స్పెక్టర్ సుమన్ కుమార్ రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్ స్పెక్టర్ గా, మేడ్చల్ డీఐగా ఉన్న ప్రసాద్ సైబారాబాద్ సీటీసీకి, సీపీవోలో ఉన్న విజయ్ కుమార్ సైబర్ క్రైమ్ పీఎస్ కు ఇన్ స్పెక్టర్ గా ట్రాన్స్ ఫర్ అయ్యారు. కొత్తూరు ఇన్​స్పెక్టర్​ ఉన్న శంకర్​రెడ్డి కౌంటర్ నార్కొటిక్స్ ఆపరేషన్ టీమ్ కు బదిలీ కాగా.. మాదాపూర్​ ఇన్​స్పెక్టర్​ తిరుపతి, అల్వాల్​ ఇన్​స్పెక్టర్​ ఆనంద్​కిశోర్​, నార్సింగి ఇన్​స్పెక్టర్​ శివకుమార్​ను హైదరాబాద్​ మల్టీజోన్–2 ఐజీ ఆఫీస్​కు ట్రాన్స్​ఫర్​ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.