తెలంగాణలో కరోనా కేసులు 60,717.. మరణాలు 505

తెలంగాణలో కరోనా కేసులు 60,717.. మరణాలు 505
తెలంగాణలో నిన్న(29న) ఒక్కరోజే   1811 పాజిటివ్ కేసులు నమోదవగా 13 మంది చనిపోయారు. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య  60,717 కు చేరగా మరణాల సంఖ్య 505 కు చేరింది.  ఇందులో  15,640 మంది చికిత్స తీసుకుంటుండగా 44,572 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న(29)న ఒక్కరోజే 18263 మందికి టెస్టులు చేయగా 1811 మందికి పాజిటివ్ వచ్చింది.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా టెస్టుల సంఖ్య 4,16,202 కు  చేరిందని ఆరోగ్య శాఖ బులిటెన్ రిలీజ్ చేసింది.నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా GHMC లో 521 కేసులు నమోదవ్వగా రంగారెడ్డి జిల్లాలో 289, మేడ్చల్ జిల్లాలో 15కు వరంగల్ అర్బన్ లో 102 కేసులు నమోదయ్యాయి.