కొత్త కోవిడ్ వేరియంట్ 'సికాడా' (Cicada) గురించి వస్తున్న వార్తలు సామాన్యులను ఆందోళను గురిచేస్తుంది. ఈ 'సికాడా' (BA.3.2) వేరియంట్ కోవిడ్-19లోని ఒమిక్రాన్ కి చెందిన ఒక కొత్త రకం వైరస్. దీనికి 70కి పైగా ఉత్పరివర్తనాలు (Mutations) ఉండటమే ఇప్పుడు శాస్త్రవేత్తల చర్చకు కారణం కారణమవుతుంది. సాధారణంగా వైరస్ రూపాన్ని మార్చుకుంటే అది వేగంగా వ్యాపిస్తుంది లేదా మన శరీరంలోని రోగనిరోధక శక్తిని దాటేస్తుంది.
ఈ సికాడా వైరస్ ప్రస్తుతం అమెరికాతో సహా దాదాపు 20 దేశాల్లో బయటపడింది. ఈ వైరస్ లక్షణాలు చూస్తే జ్వరం, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారడం, నీరసంగా అనిపించడం వంటి పాత ఒమిక్రాన్ లక్షణాలే కనిపిస్తున్నాయి. దీనికి మార్పులు (Mutations) ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది పాత వేరియంట్ల కంటే ఎక్కువ ప్రమాదం కలిగిస్తుందని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు.
భారతదేశం భయపడాలా?
ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో ఈ వేరియంట్ కేసులు ఇంకా బయటపడలేదు. మన ఆరోగ్య సంస్థలు ఈ కొత్త వేరియంట్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. మనం ఇప్పటికే తీసుకున్న వ్యాక్సిన్లు/టీకాలు తీవ్రమైన అనారోగ్యం కలగకుండా మనల్ని రక్షిస్తాయని నిపుణులు నమ్ముతున్నారు.
'సికాడా' వేరియంట్ గురించి మనం ఆందోళన చెందడం కంటే అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. వైరస్ రూపం మార్చుకోవడం సహజం. గతంలోలాగే మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది, భయపడాల్సిన ప్రమాదం లేదు.
ఆరోగ్య నిపుణులు ఆసుపత్రిలో చేరే వారి సంఖ్యను పరిశీలించడం, అవసరమైతే బూస్టర్ డోసులు తీసుకోవడం వంటివి సిఫార్సు చేస్తున్నారు. సైంటిఫిక్ అమెరికన్ ప్రకారం, ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ వేరియంట్‌కు అధిక వ్యాప్తి చెందే గుణం ఉండవచ్చని, కొంత స్థాయిలో రోగనిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యం ఉండోచ్చని సూచనలు ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే, టీకాలు వేయించుకున్న వారు లేదా గతంలో వైరస్ బారిన పడినవారు మళ్లీ ఇన్ఫెక్షన్‌కు గురికావచ్చు.
