HCLలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. 40 ఏళ్లలోపు ఉన్నవారికీ ఛాన్స్.. పూర్తి వివరాలు ఇవే !

HCLలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. 40 ఏళ్లలోపు ఉన్నవారికీ ఛాన్స్.. పూర్తి వివరాలు ఇవే !

ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్​సీఎల్) వివిధ విభాగాల్లో అనుభవజ్ఞులైన నిపుణుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్. 

మొత్తం ఖాళీలు: 43. 

విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్ 8, జియాలజీ 6, మెకానికల్ 6, సివిల్ 4, మెడికల్ & హెల్త్ సర్వీసెస్ 4, ఇండస్ట్రియల్ సేఫ్టీ 3, మినరల్ ప్రాసెసింగ్ 3, ఫైనాన్స్ 3, సర్వే 3, ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ 2, హ్యూమన్ రిసోర్సెస్1.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, ఎంబీబీఎస్, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సీఏ పూర్తిచేసి ఉండాలి. 

వయసు: 40 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 21.

లాస్ట్ డేట్: అక్టోబర్ 5.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  www.hindustancopper.comను సందర్శించండి.