హైదరాబాద్: టికెట్ చెకింగ్తో దక్షిణ మధ్య రైల్వేకు ఒక్కరోనే రూ.1.18కోట్ల ఆదాయం సమకూరింది. దీపావళి, ఛత్ పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నవంబర్ 5న ముమ్మరంగా టికెట్ తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే ఆదేశాలతో 3 జోన్లు సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్లలో తనిఖీలు చేపట్టి.. టికెట్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న వారిపై మొత్తం 11 వేల150 కేసులు నమోదు చేశారు.
జోన్ విభజన జరిగినప్పటి నుంచి ఒకే రోజు నమోదైన అత్యధిక టికెట్ తనిఖీ ఆదాయం ఇదే. కాగా, ఈ జోన్‌లో రోజువారీ టికెట్ తనిఖీ ద్వారా 4,373 కేసులతో రూ.33.44 లక్షల ఆదాయం లభిస్తోంది.
