పెట్రోల్‎లో పరిమితికి మించి ఇథనాల్.. కర్నాటక ప్రభుత్వ పరీక్షల్లో వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్స్..!

పెట్రోల్‎లో పరిమితికి మించి ఇథనాల్.. కర్నాటక ప్రభుత్వ పరీక్షల్లో వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్స్..!

బెంగళూరు: ఆయిల్ కంపెనీలు విక్రయిస్తున్న పెట్రోల్‌‌‌‌‌‌‌‌లో నిబంధనలకు విరుద్ధంగా ఇథనాల్ మోతాదు పెరిగినట్లు కర్నాటక ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రం నిర్దేశించిన 20 శాతం (ఈ20) ఇథనాల్ మిశ్రమానికి బదులుగా, కొన్ని పెట్రోల్ శాంపిల్స్‌‌‌‌‌‌‌‌లో ఏకంగా 31.2 శాతం ఇథనాల్ ఉన్నట్లు తేలడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వివిధ కంపెనీల పెట్రోల్ బంకుల్లో నుంచి 63 పెట్రోల్ నమూనాలను సేకరించి పరీక్షించగా.. నిర్దేశిత 20% పరిమితిని దాటి ఇథనాల్ మోతాదు భారీగా ఉన్నట్లు తేలింది. దీనివల్ల వాహనాల మైలేజ్ పడిపోతుందని, మెయింటెనెన్స్ ఖర్చు భారీగా పెరుగుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.