వెల్లింగ్టన్‌లో వర్షం తగ్గుముఖం పట్టడంతో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన రెండో వన్డే (47 ఓవర్ల) మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. వర్షం కారణంగా ఇరు జట్లకు చెరో 47 ఓవర్ల చొప్పున మ్యాచ్‌ను కుదించారు.
భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేస్తాం.. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు.. ఆకాశం మేఘావృతమై ఉంది, వికెట్ చాలా సేపు కవర్ల కింద ఉండిపోయింది. నిన్న పడిన వర్షంతో మా ప్రాక్టీస్ సెషన్ రద్దయినప్పటికీ, మేం చాలా బాగా సిద్ధమయ్యాం.. జట్టులో మంచి ఉత్సాహం ఉంది.. మేం ఎలాంటి మార్పులు లేకుండా మునుపటి మ్యాచ్ జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని గిల్ పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ కెప్టెన్ మిచ్ శాంట్నర్ మాట్లాడుతూ.. టాస్ గెలిచి ఉంటే మేము కుడా ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం.. ఈ స్టేడియం బౌలింగ్ కి చాలా అనుకూలమైంది. పిచ్ నుంచి బౌలర్లకు కొంత సహాయం లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ, మేం బోర్డుపై ఒక మంచి స్కోరు ఉంచడానికి ప్రయత్నిస్తామని శాంట్నర్ తెలిపాడు.
జట్లు:
న్యూజిలాండ్: విల్ యంగ్, టిమ్ సీఫెర్ట్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జామీసన్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్
