అమెరాత్ (ఒమన్): ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా అండర్–19 కుర్రాళ్లు.. ఆసియా కప్‌లో బోణీ చేశారు. టార్గెట్ ఛేజింగ్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్ (52 బాల్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 నాటౌట్), లక్ష్య రాయ్‌చందానీ (63 బాల్స్‌లో 7 ఫోర్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేయడంతో.. శుక్రవారం జరిగిన గ్రూప్–ఎ తొలి మ్యాచ్‌లో ఇండియా 10 వికెట్ల తేడాతో నేపాల్‌పై గెలిచింది. టాస్ ఓడిన నేపాల్ 42.3 ఓవర్లలో 128 రన్స్‌కు ఆలౌటైంది.
డార్ష్ సోనర్ (43) టాప్ స్కోరర్. ఆశిష్ లుహర్ (29), నీరజ్ కుమార్ యాదవ్ (20) ఫర్వాలేదనిపించారు. ఇషాన్ సూద్ (3/18), అర్జున్ రాజ్‌పుత్ (3/8), యశ్వీర్ గౌడ్ (2/25) దెబ్బకు నేపాల్ ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితమయ్యారు. తర్వాత ఇండియా 19.1 ఓవర్లలో 129/0 స్కోరు చేసి నెగ్గింది. ఈ ఇద్దరి బ్యాటింగ్ ధాటికి నేపాల్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఇషాన్ సూద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఇండియా.. పాకిస్తాన్‌తో తలపడుతుంది.
