వర్షం ఎఫెక్ట్.. భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్ఆలస్యం.. ఉదయం 8 గంటలకు టాస్!

వర్షం ఎఫెక్ట్.. భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్ఆలస్యం.. ఉదయం 8 గంటలకు టాస్!

Toss Delayed: వెల్లింగ్టన్ వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం అడ్డంకీగా మారింది. కంటీన్యూగా కురిసిన వాన కాసేపటి క్రితం తగ్గిపోయింది. దీంతో పిచ్‌పై ఉన్న కవర్లను గ్రౌండ్ సిబ్బంది పూర్తిగా తొలగించారు. ఇక టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పిచ్‌ను పరిశీలించాడు. 

టాస్ అప్‌డేట్స్: 

* టాస్ సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 8:00 AM (IST) కి (స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 PM) టాస్ జరగనుంది.

* మ్యాచ్ ప్రారంభం: భారత కాలమానం ప్రకారం ఉదయం 8:30 AM (IST) కి (స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:00 PM) తొలి బంతి పడనుంది.

మరి వర్షం కారణంగా కొన్ని ఓవర్లు కోల్పోవాల్సి వస్తుందా లేదా అనే పూర్తి వివరాలు టాస్ పడిన తర్వాత అంపైర్లు అధికారికంగా తెలియనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకు త్వరలోనే మ్యాచ్ ప్రారంభం కానుండటం పెద్ద ఊరటనిచ్చింది.