సిల్హెట్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ మెరుగైన స్కోరు సాధించింది. అమిర్ జాంగూ (133) రాణించడంతో.. 235/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 106.4 ఓవర్లలో 356 రన్స్‌కు ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్ (51), జాషువా బిషప్ (23), జోమెల్ వారికన్ (27 నాటౌట్), జైడెన్ సీల్స్ (15) ఫర్వాలేదనిపించారు.
హసన్ మహమూద్ 6, టస్కిన్ అహ్మద్, మెహిదీ హసన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 88/3 స్కోరు చేసింది. తౌహిద్ హ్రిదోయ్ (29 బ్యాటింగ్), ముష్ఫికర్ రహీమ్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తన్జిద్ హసన్ (16), నయీమ్ హసన్ (5), నజ్ముల్ హుస్సేన్ (18) నిరాశపర్చారు.
