టెస్టు క్రికెట్‌కు షమీ గుడ్‌బై.. ఎమోషనల్ పోస్ట్‌తో రిటైర్మెంట్ 

టెస్టు క్రికెట్‌కు షమీ గుడ్‌బై.. ఎమోషనల్ పోస్ట్‌తో రిటైర్మెంట్ 

Mohammed Shami: భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేశాడు. సరిగ్గా 13 సంవత్సరాల క్రితం తాను టెస్టు అరంగేట్రం చేసిన రోజే (నవంబర్ 6) ఈ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు నిన్న (శనివారం) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. వైట్ జెర్సీని వీడుతున్నా.. రెడ్ బాల్ ద్వారా పొందిన జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాలు జీవితాంతం తనతోనే ఉంటాయని ఈ 36 ఏళ్ల స్పీడ్‌స్టర్ షమీ పేర్కొన్నాడు.

షమీ భావోద్వేగ సందేశం:

వైట్ జెర్సీకి నేను వీడ్కోలు పలుకుతున్నాను, కానీ దాంతో ఉన్న జ్ఞాపకాలను ఎప్పటికీ వదులుకోనని మహమ్మద్ షమీ తెలిపాడు. మొదటిసారి భారతదేశం తరపున టెస్ట్ జెర్సీ ధరించినప్పుడు దేశం కోసం ఏదైనా చేయాలనే ఒకే ఒక కల ఉంది.. ఆ తర్వాత నేను తీసిన ప్రతి వికెట్, ప్రతి పోరాటం, చవిచూసిన గాయం, చేసిన ప్రతి కంబ్యాక్ నాకు ఎంతో కొంత నేర్పించాయి.. ఈ కెరీర్‌లో నాకు అండగా నిలిచిన కోచ్‌లు, టీమ్‌మేట్స్, కుటుంబం, అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ మహమ్మద్ షమీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్‌ పెట్టాడు. 

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగింపు:

టెస్ట్ క్రికెట్ (రెడ్ బాల్) నుంచి మాత్రమే తప్పుకుంటున్నట్లు స్పష్టం చేసిన మహమ్మద్ షమీ.. వన్డేలు, T20లు, ఐపీఎల్, దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. సీమ్ పొజిషన్, రివర్స్ స్వింగ్, విదేశీ పిచ్‌లపై అద్భుతమైన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన షమీ.. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా కొనసాగాడు.