ఐవోఏ అథ్లెట్ల కమిషన్‌‌ చైర్‌‌పర్సన్‌‌గా సింధు

ఐవోఏ అథ్లెట్ల కమిషన్‌‌ చైర్‌‌పర్సన్‌‌గా సింధు

న్యూఢిల్లీ: ఇండియా ఒలింపిక్‌‌ అసోసియేషన్‌‌ (ఐవోఏ) అథ్లెట్ల కమిషన్‌‌ చైర్‌‌పర్సన్‌‌, వైస్‌‌ చైర్‌‌పర్సన్‌‌గా.. స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు, హాకీ టీమ్‌‌ కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ ఆఫీసర్‌‌ సంజయ్‌‌ కె. శ్రీవాస్తవ ప్రకటించారు. ఐవోఏ జనరల్‌‌ బాడీ అథ్లెట్ల కమిషన్‌‌లో ప్రతినిధులుగా ఉన్న రెండు స్థానాలకు మీరాబాయి చాను, సాజన్‌‌ ప్రకాష్‌‌ నియమితులయ్యారు.

డిసెంబర్‌‌ 5న జరగనున్న ఐవోఏ ఎన్నికల తర్వాత ఏర్పాటుకానున్న కొత్త ఎగ్జిక్యూటివ్‌‌ కౌన్సిల్‌‌లో సింధు, హర్మన్‌‌ప్రీత్‌‌ సభ్యులుగా ఉంటారు. ఈ నలుగురు ప్లేయర్లు 2026–30 వరకు నాలుగేళ్ల కాలపరిమితితో బాధ్యతలు నిర్వహిస్తారు. అథ్లెటిక్స్‌‌ కమిషన్‌‌లో ఉన్న మొత్తం 10 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.