కొల్లూరు మూకాంబికా దేవిని దర్శించుకున్న బీజేపీ స్టేట్ చీఫ్

కొల్లూరు మూకాంబికా దేవిని  దర్శించుకున్న బీజేపీ స్టేట్ చీఫ్

హైదరాబాద్, వెలుగు:  కర్నాటకలోని కొల్లూరు మూకాంబికా దేవిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌‌. రాంచందర్‌‌ రావు దర్శించుకున్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన ఆలయానికి వెళ్లి, అమ్మవారికి పూజలు నిర్వహించారు. 

జగన్మాత మూకాంబికా దేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. దీపావళి దివ్యకాంతులు ప్రతి ఇంటా సరికొత్త ఉత్సాహాన్ని, ఆనందాలను నింపాలని ఆకాంక్షించారు.  ఆయన  వెంట బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌‌వీ సుభాష్‌‌ కూడా ఉన్నారు.