ఇవాళ (నవంబర్ 07) కొడంగల్ లో రైతు మేళా ఇండస్ట్రియల్ ఎక్స్ పో..ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఇవాళ (నవంబర్ 07) కొడంగల్ లో రైతు మేళా ఇండస్ట్రియల్ ఎక్స్ పో..ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్​, వెలుగు: వికారాబాద్​ జిల్లా కొడంగల్​లో నిర్వహించనున్న  రైతు మేళా, ఇండస్ట్రియల్​ఎక్స్​పోకు సర్వం సిద్ధమైంది. దుద్యాల మండలం హకీంపేట్, పోలేపల్లి పరిధిలోని సుమారు 100 ఎకరాల స్థలంలో ఈ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. 

ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. ఎక్స్‌‌‌‌‌‌‌‌పో ప్రారంభం తర్వాత..ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రముఖ ఆర్థికవేత్తలతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా ఏర్పాట్లను పర్యవేక్షించారు.