గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌‌‌‌ సెంటర్ గా హైదరాబాద్‌‌‌‌ : మంత్రి శ్రీధర్బాబు

గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌‌‌‌ సెంటర్ గా హైదరాబాద్‌‌‌‌ : మంత్రి శ్రీధర్బాబు

హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌‌‌‌కు సెంటర్​గా హైదరాబాద్‌‌‌‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గ్లోబల్ కంపెనీలు తమ కీలక కార్యకలాపాలు, పరిశోధన, ఉత్పత్తుల అభివృద్ధికి హైదరాబాద్ ను తమ గమ్యస్థానంగా మార్చుకునేలా అన్ని విధాలా అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. న్యూయార్క్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్థలకు టెక్నాలజీ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్‌‌‌‌వేర్, డేటా, అనలిటిక్స్ సేవలు అందించే పికో టెక్నాలజీ ఇండియా ఆఫీసును హైటెక్ సిటీలో శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. . ఏడాది వ్యవధిలో హైదరాబాద్ లో 100 కొత్త జీసీసీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మంత్రి వెంకట్​రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ పికో టెక్నాలజీ హైదరాబాద్‌‌‌‌లో కార్యకలాపాలను విస్తరించడం స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది’’ అని అన్నారు.