సీఎం రేవంత్‌‌ ను కలిసేందుకు 350 కి.మీ. పాదయాత్ర..కర్నూలు నుంచి వచ్చిన అభిమాని తాయన్న

సీఎం రేవంత్‌‌ ను కలిసేందుకు 350 కి.మీ. పాదయాత్ర..కర్నూలు నుంచి వచ్చిన అభిమాని తాయన్న

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌‌రెడ్డిని కలిసేందుకు ఏపీకి చెందిన ఓ అభిమాని 350 కిలోమీటర్లు కాలినడకన హైదరాబాద్ చేరుకున్నాడు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తాయన్న.. సీఎం రేవంత్‌‌రెడ్డిని కలవాలనే కోరికతో అక్టోబర్ 29న పాదయాత్ర ప్రారంభించాడు. 

తొమ్మిది రోజుల పాటు సుమారు 350 కిలోమీటర్లు నడిచి శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నాడు. సీఎం రేవంత్‌‌రెడ్డిని కలిసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా సీఎం శాలువా కప్పి, షేక్‌‌హ్యాండ్‌‌ ఇచ్చి తాయన్నను పలకరించారు.