స్మృతి, రిచా ఘోష్ విధ్వంసం.. లంక ముందు భారీ టార్గెట్: ఆసియా గేమ్స్ ఫైనల్లో రికార్డు స్కోర్!

స్మృతి, రిచా ఘోష్ విధ్వంసం.. లంక ముందు భారీ టార్గెట్: ఆసియా గేమ్స్ ఫైనల్లో రికార్డు స్కోర్!

IND W vs SL W: ఆసియా గేమ్స్ 2026 (Asian Games 2026) మహిళల క్రికెట్ పసిడి పోరులో భారత జట్టు వీరవిహారం చేసింది. జపాన్‌లోని కోరోగీ స్పోర్ట్స్ పార్క్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన హర్మాన్‌ప్రీత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రీలంక ముందు 217 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. 

మంధాన క్లాస్.. షఫాలీ మాస్: 

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. 

* స్మృతి మంధాన హాఫ్ సెంచరీ: స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడుతూ ఏకంగా 79 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. 

రెండు పరుగుల్లో హాఫ్ సెంచరీ మిస్: మరో ఓపెనర్ షఫాలీ వర్మ కూడా వీరబాదుడు బాదినప్పటికీ, కేవలం రెండు పరుగుల దూరంలో తన హాఫ్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకుని 48 పరుగుల దగ్గర పెవిలియన్ చేరింది. 

చివర్లో రిచా ఘోష్ రచ్చ.. లంక బౌలర్లకు చుక్కలే: 

* ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించింది. కేవలం 22 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

* కెప్టెన్ హర్మన్‌ ఇన్నింగ్స్: కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 17 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయింది. 


శ్రీలంక బౌలింగ్: 

శ్రీలంక బౌలర్లలో చాముది ప్రబోద, కవిషా దిల్హరి, సుగండిక కుమారి తలో వికెట్ పడగొట్టినప్పటికీ, భారత బ్యాటర్ల ధాటికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 217 పరుగుల భారీ విజేత లక్ష్యంతో బరిలోకి దిగుతున్న శ్రీలంకను కట్టడి చేసి, వరుసగా రెండోసారి ఆసియా గేమ్స్‌లో పసిడి పతకాన్ని ముద్దాడాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.