వృద్ధుల కోసం కొత్తగా నడక టెస్ట్ : కేవలం 2 మీటర్ల దూరంతోనే మీ ఆరోగ్యం తెలిసిపోతుంది..

వృద్ధుల కోసం కొత్తగా నడక టెస్ట్ : కేవలం 2 మీటర్ల దూరంతోనే మీ ఆరోగ్యం తెలిసిపోతుంది..

వృద్ధులలో నడక వేగాన్ని అంచనా వేయడానికి స్మార్ట్‌ఫోన్ సెన్సార్లు, మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి పరిశోధన సారాంశం చేసారు. సాధారణంగా వృద్ధుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి 'నడక వేగం' (Gait Speed) ఒక ముఖ్యమైన కొలమానం. దీనివల్ల వారు భవిష్యత్తులో పడిపోయే ప్రమాదం ఉందా లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఈ పరీక్ష కోసం 4 నుండి 15 మీటర్ల ఖాళీ స్థలం అవసరం. కానీ చాలా ఆసుపత్రుల్లో లేదా ఇళ్లలో అంత స్థలం ఉండదు. దీనివల్ల ఈ  పరీక్షను నిర్వహించడం కష్టమవుతోంది.

అయితే ఈ సమస్యను అధిగమించడానికి పరిశోధకులు ఒక కొత్త పద్ధతిని కనిపెట్టారు. కేవలం 2 మీటర్ల దూరంలో రెండు గుర్తులు పెడతారు. వృద్ధులు ఆ రెండు గుర్తుల చుట్టూ 3 సార్లు తిరగాలి. పరీక్ష సమయంలో వారి మడిమకు  ఒక స్మార్ట్‌ఫోన్ కడతారు.

ఎలా పనిచేస్తుంది
డేటా సేకరణ: స్మార్ట్‌ఫోన్‌లోని సెన్సార్లు అంటే యాక్సిలరోమీటర్, గైరోస్కోప్ వారు నడిచేటప్పుడు కలిగే కదలికలను రికార్డ్ చేస్తాయి. సేకరించిన సమాచారాన్ని మ్యాట్‌ల్యాబ్ (MATLAB) సాఫ్ట్‌వేర్ ద్వారా ఫిల్టర్ చేస్తారు. ఇందుకోసం 'వేవ్‌లెట్ ట్రాన్స్‌ఫార్మ్' వంటి పద్ధతులను వాడి నడకలోని సూక్ష్మమైన మార్పులను గమనిస్తారు.

సేకరించిన డేటాను విశ్లేషించడానికి రకరకాల కంప్యూటర్ మోడల్స్‌ను పరీక్షించారు. ఇందులో k-నియరెస్ట్ నేబర్స్ (KNN) అనే మోడల్ అత్యంత ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చింది. ఈ పరీక్ష ద్వారా వృద్ధుల నడక వేగాన్ని బట్టి వారిని నాలుగు రకాలుగా విభజించారు. 
*తక్కువ ప్రమాదం: సాధారణంగా నడవగలిగే వారు.
*మితమైన ప్రమాదం: వీరి ఆరోగ్యంపై కొంచెం నిఘా ఉంచాలి.
*ప్రమాదంలో ఉన్నవారు: వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

అధిక ప్రమాదం: వీరికి పడిపోయే అవకాశం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువ.

ఈ పరిశోధన వల్ల ఉపయోగాలు
* పెద్ద కారిడార్లు అవసరం లేదు, చిన్న రూమ్ లో కూడా టెస్ట్ చేయవచ్చు.
*ఖచ్చితత్వం: స్మార్ట్‌ఫోన్ సెన్సార్ల వల్ల ఫలితాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి.
*సులభం: డాక్టర్లు క్లినిక్‌లలో లేదా రోగుల ఇళ్ల వద్దే ఈ పరీక్షను నిర్వహించి, వారి ఆరోగ్య స్థితిని వెంటనే అంచనా వేయవచ్చు.

మొత్తంగా చెప్పాలంటే, అందుబాటులో ఉన్న సాంకేతికత (స్మార్ట్‌ఫోన్) ఉపయోగించి, తక్కువ ఖర్చుతో వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడటమే ఈ అధ్యయనం  ముఖ్య ఉద్దేశ్యం.