హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో 18వ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్ (హెచ్జేఎఫ్ 2026) ప్రారంభమైంది. ఇన్‌ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా, హైటెక్ సిటీ జ్యువెలరీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ దీనిని నిర్వహిస్తోంది. ఇందులో 350 కి పైగా ఎగ్జిబిటర్లు, 750 కి పైగా బ్రాండ్లు పాల్గొన్నాయి. ఆభరణాల తయారీదారులు తమ సరికొత్త డిజైన్లను ప్రదర్శిస్తున్నారు. జ్యువెలరీ రీటైల్ సింపోజియం, ఝావేరీ బజార్ పెవిలియన్ ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
