ఏటా గుండె ఆగి చనిపోతున్నోళ్లు 2.5 లక్షలు

ఏటా గుండె ఆగి చనిపోతున్నోళ్లు 2.5 లక్షలు

హైదరాబాద్, వెలుగు36 ఏండ్ల ఉమాశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్​లో హార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ర్టేటర్​గా పనిచేసేవాడు.  ఓ రోజు పొద్దున్నే బైక్ బయటకు తీస్తూ, ఇంటి ముందే కుప్పకూలిపోయాడు. నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయాడు. భర్తకు ఏమైందో తెలియక పక్కనే ఉన్న భార్య హతాశురాలైంది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రైతు గట్టయ్య ఎడ్ల బండిలో వెళ్తూ, మార్గం మధ్యలో ప్రాణాలొదిలాడు. అతని వయసు 45 ఏండ్లే. ఇంట్లో టీవీ చూస్తూనే వరంగల్ వాసి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కసారిగా కుర్చీలో నుంచి కింద పడ్డాడు. కుటుంబ సభ్యులు తేరుకుని, దవాఖానకు తరలించేలోపలే చనిపోయాడు. ఇలా దేశంలో ప్రతి సంవత్సరం 2.5 లక్షల మంది సడన్​గా గుండె ఆగి చనిపోతున్నారు. వీళ్లలో గుండె జబ్బులంటే ఏంటో తెలియనివాళ్లు, మంచి ఆరోగ్యంతో బతికినవాళ్లు కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇటీవల రాష్ట్రంలో ‘సడన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డియాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ల సంఖ్య పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. గుండెపోటు బాధితులను త్వరగా దవాఖానకు చేర్చేందుకు ప్రభుత్వం కూడా ‘స్టెమీ’ పేరుతో ప్రత్యేక అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను, చికిత్స కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

కారణాలు అనేకం..

సాధారణంగా గుండెపోటు వచ్చినప్పుడు గుండెలోని ఏదో ఒక భాగం లేదా కొంత భాగం పనిచేయడం మానేస్తుంది. దీంతో ఆ వ్యక్తి కొంత సేపైనా ఊపిరి తీసుకోగలుగుతాడు. అయితే కార్డియాక్ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం గుండె మొత్తంగా ఆగిపోతుంది. శరీర భాగాలకు రక్తం సరఫరా సడన్​గా ఆగిపోతుంది. అప్పటిదాకా బాగున్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయి, నిమిషాల వ్యవధిలోనే చనిపోతాడు. సడన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డియాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాలా కారణాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా ఎక్కువవడం లేదా తక్కువవడాన్ని కార్డియాక్ ఎరిత్మియా అంటారు. మన గుండెలో అతితక్కువ ప్రమాణంలో విద్యుత్తు ప్రవహిస్తుంటుంది.  తరంగాల ప్రసరణలో తేడా వస్తే హార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీట్ విపరీతంగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. దీంతో గుండె ఒక్కసారిగా ఆగిపోతుంది. బీపీ, షుగర్​, సిగరెట్​ తాగడం, మెంటల్​ టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆవేశం వంటి కారణాల వల్ల కార్డియాక్​ ఎరిత్మియా వచ్చే ప్రమాదముంటుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో(ఆర్టరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కొవ్వు పేరుకుపోతే, వాటి గోడలు గట్టిపడడంతోపాటు, చిన్నగా మారుతాయి. రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి, గుండె కండరాలకు సరిపడా ఆక్సిజన్ అందదు. దీంతో గుండెపోటు లేదా సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదముంటుంది. గుండె కండరాలు బిగుసుకుపోవడం, సాగదీసుకుపోవడం వల్ల కూడా గుండె ఆగిపోయే ప్రమాదముంటుంది. దీన్నే కార్డియోమయోపతి అంటారు.  దీర్ఘకాలం హై బీపీ, గుండె కండరం దెబ్బతినడం వంటి అనేక కారణాలు కార్డియో మయోపతికి దారి తీస్తాయి. గుండెపోటు కూడా సమయం గడిచినకొద్దీ కార్డియాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుతుంది. గుండె నిర్మాణంలో లోపాలు, గుండె కండరాల  ఎదుగుదలలో లోపాలు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, హార్ట్ ఫెయిల్యూర్ వంటి పలు కారణాల వల్ల గుండె ఆగిపోతుంటుందని డాక్టర్లు చెబుతున్నారు.

ప్రమాదం అంచులో యూత్​

సాధారణంగా 35 నుంచి 75 ఏండ్ల వయసున్న వారిలో కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదముంటుంది. కానీ, ఇప్పుడు 35 ఏండ్ల లోపు వాళ్లు కూడా దీని బారిన పడుతున్నారు. ఎంత తక్కువ వయసులో స్ర్టోక్ వస్తే, అంత ఎక్కువ సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.  జీవనశైలిలో వచ్చిన మార్పులతో సమయానికి తినక పోవడం, జంక్ ఫుడ్, ఊబకాయం, సిగరెట్‌‌‌‌‌‌‌‌, మందు తాగడం, మానసిక ఒత్తిడి, బీపీ, షుగర్‌‌‌‌‌‌‌‌ వల్ల ఎట్లాంటి హార్ట్ డిసీజ్ హిస్టరీ లేనివాళ్లు కూడా కార్డియాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరెస్ట్ బారిన పడుతున్నారు. కార్డియాక్ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెద్దగా లక్షణాలేమీ ఉండవు. రోజూ వ్యాయామం చేస్తే, దీని బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు. అలాగే, రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈసీజీ, 2డీ ఎకో వంటి టెస్టులు చేపించుకోవాలంటున్నారు. వీటితో ప్రమాదాన్ని ముందే గుర్తించి, ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశముంటుంది. అయితే, అధికశాతం మంది మనకెందుకు వస్తుందిలే అని లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటుండడంతో ప్రాణాలు కోల్పోతున్నారు.

ఎవరైనా సడన్​గా కుప్పకూలితే ఇలా చెయ్యాలి

ఎవరైనా ఛాతీలో అసౌకర్యంతో సడన్​గా కుప్పకూలిపోతుంటే చుట్టుపక్కనున్నవాళ్లు వెంటనే స్పందించాలి. ఆ మనిషి స్సృహలో ఉన్నాడా.. శ్వాస తీసుకుంటున్నాడా.. గుండె కొట్టుకుంటోందా? చూడాలి. ఇవి లేనప్పుడు వెంటనే చేయిపై మరో చేయి పెట్టి బాధితుడి గుండెపై గట్టిగా అదుముతుండాలి. ఇలా 30 సార్లు చేయాలి. తర్వాత రెండు ముక్కు రంధ్రాలు మూసి కిందపడిపోయిన వ్యక్తి నోటిలో గట్టిగా గాలి ఊదాలి. గుండెపై గట్టిగా అదుముతుండడం, నోటిలోకి గాలి ఊదడం ఒకదాని తర్వాత మరొకటి రెండుసార్లు చేయాలి. ఇలా రెండు సార్లు చేయడం వల్ల 40 నిమిషాల పాటు గుండె దెబ్బతినకుండా ఉంటుంది. దీన్నే సీపీఆర్ అంటారు. దీంతో గుండె యథాతథంగా పని చేసే అవకాశాలున్నాయి. సీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత వెంటనే ఆస్పత్రికి తరలించాలి.