తుఫాన్ వస్తోంది..మే 29న టీజర్‌‌‌‌‌‌‌‌

తుఫాన్ వస్తోంది..మే 29న టీజర్‌‌‌‌‌‌‌‌

ఇటీవల ‘లవ్‌‌‌‌ గురు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ ఆంటోనీ... తాజాగా ‘తుఫాన్‌‌‌‌’ అనే మరో సినిమాను రిలీజ్‌‌‌‌కు రెడీ చేస్తున్నాడు. విజయ్ మిల్టన్‌‌‌‌ దీనికి దర్శకుడు. గతంలో విజయ్ ఆంటోనీతో రాఘవన్, హత్య చిత్రాలు తీసిన ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈనెల 29న టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఇది. దీవి నేపథ్యంలో జరిగే కథ కావడంతో అండమాన్, డయ్యూ డామన్‌‌‌‌లలో షూటింగ్‌‌‌‌ చేశారు. శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో సినిమాను గ్రాండ్‌‌‌‌గా రిలీజ్‌‌‌‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.