
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చవేశారు. పసుమాముల గ్రామంలోని సర్వే నంబర్ 422లో ప్రభుత్వ భూమి ఉంది. అందులోని 15 గుంటల భూమిని రియల్‌ఎస్టేట్‌వ్యాపారం చేసే లక్ష్మారెడ్డి అనే వ్యక్తి కబ్జా చేసి రెండు భారీ షెడ్లు నిర్మించాడు. వాటిని గోదాములుగా రెంట్‌కు ఇచ్చేందుకు సిద్ధం చేశాడు.
విషయం తెలుసుకున్న అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్రవీందర్ దత్తు సోమవారం రెవెన్యూ సిబ్బందితో కలిసి జేసీబీతో షెడ్లను కూల్చివేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు.
వట్టినాగులపల్లిలో..
గండిపేట : నార్సింగి మున్సిపాలిటీ వట్టినాగులపల్లి గ్రామ సర్వే నంబర్128లోని ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఐ విక్రమ్ సమక్షంలో కూల్చివేత కొనసాగింది. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ హెచ్చరించారు.