ప్రస్తుతం భారతీయ సినిమాలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'వారణాసి'. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిల కలయికలో వస్తున్న ఈ సినిమాపై కేవలం దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగానూ అంచనాలు ఆకాశాన్ని అంటాయి. రికార్డు బడ్జెట్‌తో, గ్లోబల్ ఆడియెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
గ్లోబల్ లెవల్‌లో టైటిల్..
ఎన్నో నెలల ఊహాగానాలకు తెరదించుతూ, ఇటీవల ఈ చిత్రం 'వారణాసి' అనే టైటిల్‌తో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ టైటిల్ లాంచ్‌లోనే మహేశ్ బాబు పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన సర్ప్రైజ్‌ను రాజమౌళి రివీల్ చేశారు. మహేశ్ బాబు ఈ సినిమాలో రుద్ర, శ్రీరాముడు పాత్రల ఛాయలు కలిగిన ఒక శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే ఖరారైంది. ఈ ప్రకటనతోనే అభిమానుల్లో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది.
ఐదు గెటప్స్‌లో సూపర్ స్టార్!
సినిమా క్రేజ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. లేటెస్ట్ గా సినీ వర్గాల్లో మరో సంచలన చర్చ మొదలైంది. రాజమౌళి విజన్ ప్రకారం, 'వారణాసి' చిత్రంలో మహేశ్ బాబు ఏకంగా 5 విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై తెగ చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే బయటకు వచ్చిన రుద్రుడు, శ్రీరాముడి లుక్స్‌తో పాటు, ఇంకా మూడు సరికొత్త రూపాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. జక్కన్న మాస్టర్ ప్లాన్‌లో భాగంగా, మహేశ్ బాబును అభిమానులు ఇప్పటివరకు చూడని రీతిలో, ఒక విజువల్ వండర్‌గా, సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ అవతారాలలో తెరపై చూపించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే వీటిపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.
ఆస్కార్ రేంజ్ అంచనాలు..
రాజమౌళి తన సినిమాలలో హీరో పాత్రను ఎలివేట్ చేయడంలో, వారికి విభిన్నమైన లుక్స్ ఇవ్వడంలో సిద్ధహస్తుడు. 'బాహుబలి'లో ప్రభాస్‌ను శివుడి అవతారంలో, 'RRR'లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు విప్లవ వీరుల గెటప్‌లను చూపించారు. ఇప్పుడు 'వారణాసి'లో మహేశ్ బాబుకు ఏకంగా 5 అవతారాలను డిజైన్ చేశారంటే, ఆ పాత్ర పరిధి, కథనం యొక్క డెప్త్ ఎంత గొప్పగా ఉండబోతుందో ఊహించవచ్చు. ఇది కేవలం లుక్స్ మార్పు మాత్రమే కాదు, కథనంలో వచ్చే వివిధ దశలు లేదా కాలాలకు సంబంధించిన ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.
ఈ ఐదు అవతారాల స్పష్టమైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రచారం నిజమైతే, మహేశ్ బాబు అభిమానులకు ఇది నిజంగానే ఒక పెద్ద పండగ. ఈ చిత్రం ఇండియన్ సినిమాకు మరో ఆస్కార్ రేంజ్ విజయాన్ని అందిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్యాన్-వరల్డ్ చిత్రంలో మహేశ్ బాబుకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషించనుంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు..ఈ కాస్టింగ్ తో పాటు పలువురు స్టార్ లు దీనిలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కేవలం భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేయాలనేది రాజమౌళి లక్ష్యంగా ఉన్నారు.. ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణన్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ కథాంశం భారతదేశంలోని పురాతన సంస్కృతి, అడ్వెంచర్ అంశాలతో కూడిన 'ఇండియానా జోన్స్' తరహాలో ఉంటుందని తెలుస్తోంది. రాజమౌళి మేకింగ్‌లో మహేశ్ బాబు నటన ఏ స్థాయిలో ఉంటుందో చూడటానికి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

