V6 News

హైఫీవర్ ఉన్నా..సభకు అమిత్ షా .. చర్చలో పాల్గొన్న కేంద్రమంత్రి

హైఫీవర్ ఉన్నా..సభకు అమిత్ షా ..  చర్చలో పాల్గొన్న కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా 102 డిగ్రీల జ్వరంతోనే గురువారం లోక్‌‌‌‌‌‌‌‌సభకు అటెండ్ అయ్యారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంత జ్వరంలోనూ ఆయన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 'ఓట్ చోరీ' ఆరోపణలకు సమాధానం ఇచ్చారని తెలిపాయి. ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా సవరణ(సర్)పై జరగిన చర్చలో అమిత్ షా 90 నిమిషాలు మాట్లాడారని వివరించాయి. సెషన్ కు ముందు డాక్టర్లు చికిత్స అందించినప్పటికీ, జ్వరం తగ్గకపోయినా ఆయన సభకు హాజరై, ప్రభుత్వం తరఫున ప్రతిపక్షానికి సమాధానాలిచ్చినట్లు పేర్కొన్నాయి.