V6 News

Akhanda 2 Review: ‘అఖండ 2: తాండవం’ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

Akhanda 2 Review: ‘అఖండ 2: తాండవం’ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda2 Thaandavam). డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అనూహ్యంగా వాయిదా పడింది. చివరికి సమస్యలను పూర్తి చేసుకుని ఇవాళ శుక్రవారం (2025 డిసెంబర్ 12న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే, ఒక రోజు ముందుగానే గురువారం రాత్రి (డిసెంబర్ 11న) ప్రీమియర్ షోలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శితమయ్యాయి.

ఈ క్రమంలో భారీ అంచనాలతో వచ్చిన అఖండ 2 ఎలా ఉంది? మూవీ చూసిన బాలయ్య ఫ్యాన్స్ మరియు సినీ ఆడియన్స్ సోషల్ మీడియాలో ఎలా రియాక్ట్ అవుతున్నారు? సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్తో వచ్చిన అఖండ 2 అసలు కథేంటీ? అఘోర పాత్రలో బాలయ్య ఎలాంటి సంభవం సృష్టించాడు? బోయపాటి మాస్ మార్క్ చూపించాడా? లేదా ? అనేది ప్రీమియర్ రివ్యూలో తెలుసుకుందాం.

అఖండ 2 కథగా.. 

2021లో వచ్చిన అఖండ సినిమాకి సీక్వెల్‌గా తీసిన ఈ తాండవం.. అప్పటి కథకి 15 ఏళ్ల తర్వాత ఏం జరిగింది అనే కథతో మొదలవుతుంది.

చైనా మిలిటరీ భారత్‌‌పై దాడి చేసి సమగ్రతను దెబ్బ తీయాలని కుట్ర పన్నుతుంది. అందుకు చైనా మిలిటరీ అధిపతికి భారత్‌లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న ఠాకూర్‌ (కబీర్‌ దుల్షన్‌ సింగ్‌) ని పావుగా వాడుతాడు. ఈ క్రమంలో హిందూమతంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవమైన మహ కుంభమేళాను టార్గెట్ చేస్తారు. ఈ క్రమంలో ఆ పవిత్రమైన గంగానదిలో వైరస్ కలుపుతారు. ఇదే అదనుగా చేసుకుని ప్రతిపక్ష నేత ఠాకూర్‌ ఈ ఘటనను రాద్ధాంతం చేసి దేవుడే ఉంటే ఇలా జరిగేకాదు. అసలు దేవుడు అనేవాడే లేడు అని సామాన్యులను నమ్మిస్తాడు. జనాలు కూడా దేవుళ్లకు పూజలు చేయడం ఆపేస్తారు.

ఇదే క్రమంలో అందుకు విరుగుడుగా DRDOలో శాస్త్ర‌వేత్త‌లు యాంటీ డాట్ వాక్సిన్‌ని క‌నిపెడ‌తారు. ఈ బృందంలో ఒకరైన యువ శాస్త్ర‌వేత్త జ‌న‌ని (హ‌ర్షాలీ మ‌ల్హోత్రా) ఒక్క‌రే వ్యాక్సిన్‌తో బ‌య‌ట‌ప‌డుతుంది. రాయలసీమలో ఎమ్మెల్యేగా ఉన్న బాల మురళీ కృష్ణ (బాలకృష్ణ) కూతురే ఈ యువ శాస్త్ర‌వేత్త జ‌న‌ని. తాను ఒక్కతి మాత్రమే వాక్సిన్తో బయటపడుతుంది. ఈ క్రమంలో ఆ వ్యాక్సిన్‌ను, జననీని మట్టుపెట్టడానికి చైనా మిలిటరీ చీఫ్ ప్లాన్ చేస్తాడు. ఆ సమయంలో ఆమెని ర‌క్షించేందుకు రుద్ర సికింద‌ర్ అఘోరా (బాల‌కృష్ణ‌) రంగంలోకి దిగుతాడు.

అఖండ అస్థిత్వం ఏమిటి? దేవుడే లేడని నమ్మిన జనాలకు.. ఆయన ఉన్నాడు.. ఆపద వస్తే వస్తాడు? అని అఘోరా ఎలా నిరూపించాడు? జ‌న‌ని ఆప‌ద‌లో ఉన్న విష‌యం అఘోరాకి ఎలా తెలిసింది? 17 ఏళ్ల వయసులోనే జననీ యువ సైంటిస్టుగా దేశానికి ఎలాంటి సేవ చేసింది? ప్రతిపక్ష నేత, చైనా జనరల్ చేసిన ప్రయత్నాలను అఖండ రుద్ర ఎలా అడ్డుకున్నాడు? సనాతన ధర్మం కోసం అఖండ చేసిన పోరాటం ఏమిటి? ముఖ్యంగా నేత్ర (ఆదిపినిశెట్టి), అర్చనగోస్వామి (సంయుక్త)ల పాత్ర ఏమిటీ? అనే ప్రశ్నలకు సమాధానమే అఖండ తాండవం కథ.

పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే:

తెలుగు ఆడియన్స్లో మాస్ సినిమాలంటే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు తిరుగులేని రికార్డు ఉంది. 'సింహా', 'లెజెండ్', 'అఖండ'తో మూడు బ్లాక్‌బస్టర్‌లను అందించిన ఈ డైనమిక్ ద్వయం నుండి వచ్చిన మరో బ్లాక్ బస్టర్ మూవీగా 'అఖండ 2: తాండవం'గా నిలిచే అవకాశం ఉంది.

దాదాపు బాలయ్య ఫ్యాన్సే ఎక్కువ సంఖ్యలో ప్రీమియర్స్ చూస్తారు కాబట్టి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. వారి అభిప్రాయాలు X (గతంలో ట్విట్టర్)ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో 2021లో 'అఖండ' సృష్టించిన సునామీని మించి, ఈ సీక్వెల్ మరింత రౌద్రంగా, శక్తిమంతంగా ఉందని సినీ ఆడియన్స్ ట్వీట్స్ పెడుతున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ కోరుకునే భీకరమైన యాక్షన్, గూస్బంప్స్ డైలాగ్స్ ఈసారి రెట్టింపు స్థాయిలో అలరించాయని అంటున్నారు.

బాలకృష్ణ ఈసారి కూడా రెండు పాత్రల్లో నటించగా.. మర్మమైన అఘోరా అవతారంలో సంభవం సృష్టించాడని, అఘోరా పాత్ర యొక్క లోర్, శక్తిని ఈసారి బోయపాటి శ్రీను మరింత పెద్ద కాన్వాస్‌పై చూపించాడని బాలయ్య ఫ్యాన్స్ ట్వీట్స్ పెడుతున్నారు. ఈ సీక్వెల్‌లో కేవలం యాక్షన్‌కే కాకుండా, ఆధ్యాత్మికత, పౌరాణిక అంశాలపై బోయపాటి మరింత లోతుగా దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు.

ఇక నార్మల్ ఆడియన్స్ విషయానికి వస్తే.. దైవశక్తితో కథను ప్రారంభించిన బోయపాటి మధ్యలో దృష్టశక్తిని తీసుకొచ్చి.. చివరిలో దేశభక్తితో  ముగించాడుని అంటున్నారు. మధ్య మధ్యలో సనానతధర్మం గురించి క్లాసులు తప్పితే.. ఒక్క సీన్‌ కూడా ఆకట్టుకునేలా ఉండదు. అసలు కథనమే ఊహకందేలా సాగితే.. సినిమాపై ఆసక్తి ఎలా పెరుగుతుంది? ఫస్ట్ పార్ట్ అఖండని మించిన కథ పార్ట్ 2లో ఏ మాత్రం కనిపించదని ట్వీట్స్ పెడుతున్నారు. ఇక ఇవాళ ఫస్ట్ డే వచ్చిని టాక్ని బట్టి సినిమా సక్సెస్ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది.