రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse).. ఫస్ట్ సినిమాతోనే తన గ్లామర్‌తో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకుంది. అందుకే ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది. దీంతో ఈ ఏడాది తన నుంచి మూడు సినిమాలు వచ్చాయి.
వాటిలో విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ‘కింగ్‌డమ్’ ఒకటి. కానీ తొలిచిత్రం తరహాలో ఇది కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆపై తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘కాంత’ చిత్రంతో తనలోని పెర్ఫార్మెన్స్‌ను చూడబోతున్నారని ప్రమోషన్స్‌లో చెప్పింది భాగ్యశ్రీ.
ఆమె చెప్పినట్టు నటనకు మంచి మార్కులు పడ్డా.. ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. వీటన్నింటికంటే ఆమె ఎక్కువ ఆశలు పెట్టుకున్న సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ప్రమోషన్స్‌లో ఆ కాన్ఫిడెన్స్ కనిపించింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వసూళ్ల విషయంలో ఆ ప్రభావం కనిపించలేదు.
ఇలా ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన భాగ్యశ్రీని విజయం మాత్రం వరించలేదు. నిజానికి కెరీర్ విషయంలో పక్కా ప్లానింగ్‌తో ముందుకెళుతోంది భాగ్యశ్రీ. రొటీన్ గ్లామర్ రోల్స్ కాకుండా వైవిధ్యంతో పాటు నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటోంది. కానీ సక్సెస్ మాత్రం ఆమెతో దోబూచులాడుతోంది. ప్రస్తుతం అఖిల్‌కు జంటగా ‘లెనిన్’ అనే చిత్రంలో ఆమె నటిస్తోందని సమాచారం.
తెలుగులో మరో బంపరాఫర్ కూడా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలే రాజు వెడ్స్ రాంబాయితో నిర్మాతగా హిట్టు కొట్టిన డైరెక్టర్ వేణు ఊడుగుల.. అశ్వనీదత్ కుమార్తె స్వప్నా దత్‌తో కలిసి ఓ ఫిమేల్ సెంట్రిక్ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్నఈ సినిమాకు రమేష్ ఎలిగేటి దర్శకత్వం వహించబోతున్నట్లు చెబుతున్నారు. మరి కొత్త ఏడాదిలో ఈ సినిమాతో సక్సెస్ జెండా ఎగరేస్తుందేమో చూడాలి!
లోపం ఎక్కడుంది?
సినిమా కథ, కథనాల్లో మాత్రమే లోపం ఉంది. భాగ్యశ్రీ నటనలో మాత్రం ఎటువంటి మైనస్ లేదు. తనకు వచ్చిన పాత్రలో ప్రాణం పెట్టి నటిస్తోంది. ఇటీవలే దుల్కర్ కాంత సినిమాలో 'కుమారి' పాత్ర పోషించింది. తన నటనతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.అలనాటి నటి సావిత్రిని గుర్తుచేసేలా ఆమె నటన ఉందని ప్రశంసలు వచ్చాయి. అలాగే “ఆంధ్ర కింగ్ తాలూకా”లో మహాలక్ష్మి పాత్రలో సైతం మెప్పించింది. క్రేజ్ ఎంత వచ్చినా… ఈ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ముఖ్యం. అదే ఆమెకి లేదు.

