శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ప్రారంభం.. 

 శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ప్రారంభం.. 

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.  ఈ రోజు నుంచి ( 2026 మార్చి 16)   ఈ నెల 20 వరకు 5 రోజులపాటు జరిగే ఉగాది ఉత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీశైలంలో మల్లన్న స్వామి వారు  యాగశాల ప్రవేశం చేశారు.  అనంతరం  ఆలయ అర్చకులు,వేదపండితులు,ఈవో శ్రీనివాసరావు దంపతులు వైభవంగా ఉత్సవాలను  ప్రారంభించారు.  

 యాగశాలలో శాస్త్రోక్తంగా గణపతిపూజ,విశేష పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు . మార్చి 16 న  ఉగాది మహోత్సవాలు ప్రారంభం కావడంతో ప్రతి ఒక్క భక్తునికి సౌకర్యవంతమైన దర్శన కల్పన కోసం శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు అన్నారు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఇప్పటికే కన్నడ,మహారాష్ట్ర భక్తులకు పాదయాత్ర మార్గంలో.. క్షేత్రంలో పలుచోట్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.  భక్తుల దాహార్తిని తీర్చేందుకు తాగు నీటికి ఎలాంగి  ఇబ్బందులు  లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని  ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

ఉగాది ఉత్సవాలలో భాగంగా సాయంత్రం అంకురార్పణ,అగ్నిప్రతిష్టాపన అనంతరం అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు .  అనంతరం శ్రీస్వామి అమ్మవారు బృంగివాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకొని క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవంగా భక్తులకు దర్శనమిస్తూ బృంగివాహనంపై విహరించనున్నారు...