తిరుపతిలో వైసీపీ, టీడీపీ మధ్య వార్ ఉద్రిక్తతకు దారి తీసింది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటల్ గ్రాండ్ రిచ్ దగ్గర వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ కారణంగా ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ( మార్చి 16 ) టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ ప్లకార్డులతో నిరసనకు దిగారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో వైసీపీ నేతలను అడ్డుకున్నారు టీడీపీ నేతలు.
టిడిపి నేత జేబీ శ్రీనివాసులు అనుచరులు వైసీపీ నేతలను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. వైసీపీ నేతల చేతుల్లో ప్లకార్డులను లాక్కోవడంతో ఘర్షణ తీవ్రమైంది. వైసీపీ నార్త్ క్లస్టర్ అధ్యక్షుడు నవీన్ పై దాడి చేశారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో గ్రాండ్ రిచ్ హోటల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. ఇరువర్గాలను చెదరగొట్టారు. వైసీపీకి చెందిన మహిళలతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అదుపులోకి తీసుకున్నవారిని తిరుచానూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు.
