V6 News

వీకెండ్ బాక్సాఫీస్ వార్: అఖండ 2కి గట్టి పోటీ ఇవ్వనున్న‘మోగ్లీ’.. 99 రూపాయలకే టికెట్.. సెలబ్రిటీ షో రివ్యూ ఇదే!

వీకెండ్ బాక్సాఫీస్ వార్: అఖండ 2కి గట్టి పోటీ ఇవ్వనున్న‘మోగ్లీ’.. 99 రూపాయలకే టికెట్.. సెలబ్రిటీ షో రివ్యూ ఇదే!

రోషన్ కనకాల హీరోగా ‘కలర్‌‌‌‌‌‌‌‌ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ రూపొందించిన  చిత్రం ‘మోగ్లీ 2025’. సాక్షి మడోల్కర్ హీరోయిన్‌‌‌‌. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్  నిర్మించారు. రేపు శనివారం (డిసెంబర్ 13న) సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా మౌగ్లీ స్పెషల్ ప్రీమియర్స్ పలు సెలెక్టెడ్ థియేటర్లలో డిసెంబర్ 11న రాత్రి ప్రదర్శించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీలకు ఈ ప్రీమియర్ షోలు వేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో పాటుగా, హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్స్ సాయి రాజేష్, అనుదీప్, నిర్మాతలు SKN, బన్నీ వాసు తదితరులు సినిమా చూశారు.

వీరి నుంచి మోగ్లీకి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. మంత్రముగ్ధులను చేసే ప్రేమకథతో పాటుగా యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ అదిరిపోయాయట. ఎవ్వరూ ఊహించని క్లైమాక్స్ సినిమాకు మైండ్‌బ్లోయింగ్ అని సినిమా చూసిన సెలబ్రిటీలు ట్వీట్స్ పెడుతున్నారు.

ఇకపోతే ఇవాళ (డిసెంబర్ 12న) రెగ్యులర్ ప్రీమియర్ షోలు ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేటు రూ.99 గా నిర్ణయించారు. అంటే వంద రూపాయలు అన్నమాట. దీని వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది.

అఖండ 2 vs మోగ్లీ:

అఖండ 2 ఇవాళ (డిసెంబర్ 12న) థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాకు పోటీగా  'మోగ్లీ 2025' మాత్రమే బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఈ  రెండు సినిమాల జానర్స్ వేరైనప్పటికీ.. భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణం నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ 'కలర్ ఫోటో' దర్శకుడు సందీప్ రాజ్ 'మోగ్లీ' తెరకెక్కించడం. అలాగే, ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 కంటే మోగ్లీ టికెట్ రేట్ తక్కువ ఉండటం. అంతేకాకుండా మోగ్లీ టీజర్, ట్రైలర్ విజువల్స్ హై లెవల్ కంటెంట్ ఉండటం కూడా!! సో యాంకర్ సుమ కొడుకు రోషన్.. బాలయ్య బాబు మధ్య బాక్సాఫీస్ వార్ ఎలా ఉంటుందో చూడాలి!!

►ALSO READ | Rajinikanth: మేనరిజంతో అభిమానుల ఆకలి తీరుస్తున్న రజినీ.. 75 ఏళ్ల వయసులోనూ బాక్సాఫీస్ రూలింగ్..

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘సందీప్ రాజ్ రూపొందించిన ‘ కలర్ ఫొటో’ లానే ‘మోగ్లీ’ కూడా ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అవుతుంది. ఇందులోని  క్యారెక్టర్లు  చూస్తున్నప్పుడే చాలా మ్యాడ్‌‌‌‌నెస్ కనిపిస్తుంది. ప్యాషన్‌‌‌‌తో ఈ సినిమా తీశారు. రోషన్‌‌‌‌కి  సినిమా మీద ఉన్న పిచ్చి ప్రేమ స్క్రీన్ మీద చూస్తారు. తనని చూస్తుంటే చిరుత సినిమాలో చరణ్‌‌‌‌ని చూస్తున్నట్టుగా అనిపించింది’ అంటూ టీమ్‌‌‌‌ అందరికీ బెస్ట్‌‌‌‌ విషెస్‌‌‌‌ చెప్పాడు.

హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ ‘ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక యుద్ధం ఉంటుంది. ఇందులో మోగ్లీ తన ప్రేమం కోసం యుద్ధం చేస్తాడు. అందరూ మోగ్లీ చేసే యుద్ధంలో తోడుండి గెలిపించాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు.  ‘ఇది నా మొదటి సినిమానే కాదు.. నా హార్ట్’ అని సాక్షి మడోల్కర్ చెప్పింది.

డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ ‘ప్రేక్షకుడి సమయానికి వ్యాల్యూ ఇచ్చి తీసిన సినిమా ఇది. కామెడీ యాక్షన్ డ్రామా విపరీతంగా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు.  ఈ సినిమా లార్జెస్ట్ స్పాన్ ఉన్న ఇంటెన్స్ యాక్షన్ అడ్వెంచర్ అని, అందరికీ కచ్చితంగా నచ్చుతుందని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ అన్నారు. నటులు బండి సరోజ్ కుమార్, వైవా హర్ష, లిరిక్ రైటర్ చంద్రబోస్ పాల్గొన్నారు.