మైత్రీ మూవీ మేకర్స్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ..హైకోర్టు నిబంధనపై స్టే విధింపు 

మైత్రీ మూవీ మేకర్స్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ..హైకోర్టు నిబంధనపై స్టే విధింపు 

న్యూఢిల్లీ, వెల: సినిమా టికెట్ల ధర పెంపు విషయంలో తాజాగా సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు విధించిన 90 రోజుల నిబంధనపై స్టే విధించింది. ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాచేపల్లి చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.

టికెట్ల ధరల పెంపు నిర్ణయాన్ని కనీసం 90 రోజుల ముందుగానే పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచేలా చూడాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. సినిమా విడుదలకు 90 రోజుల ముందే పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలి’ అని పిటిషర్​కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈనెల 9న మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్​పై శుక్రవారం వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ.. విచారణను వాయిదా వేసింది.