సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మున్సిపాలిటీలో పరిధిలోని సీటిజెన్ కాలనీలో నిర్మాణంలో భవనం వాచ్ మెన్‌గా భార్యభర్తలను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతులు సోమ్లాదశరధ్(50), మాన్యమ్మ(45)గా పోలీసులుగుర్తించారు.
గత కొంతకాలంగా పటాన్ చెరు పరిధిలోని సిటిజెన కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనానికి సోమ్లా ధశరథ్వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. భార్య మాన్యమ్మతోపాటు అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం (మార్చి14) ఉదయంం వారు నివసిస్తున్న గుడిసెలో శవాలై కనిపించారు.
మృతులు దశరథ్, మాన్యమ్మపై పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు కనిపిస్తుంది. ఇద్దరినీ తలపై మోదడంతో ముఖాలు చిద్రమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
