హైదరాబాద్ గండిపేట చెరువు దగ్గర ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన కలకలం రేపింది. ఆదివారం (మార్చి 15) సాయంత్రం చేపల వేటకు వెళ్లిన యువకులు మూసీలో గల్లంతై చనిపోయినట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, రెస్క్యూ టీమ్ చేపట్టిన గాలింపు చర్యల్లో సోమవారం (మార్చి 16) మృతదేహాలు లభ్యమయ్యాయి.
చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. మృతులు కార్తీక్ (25), గోవర్ధన్ (23), వెంకటేష్ (25) గా గుర్తించారు. మృతులంతా హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు.
యువకులు గుల్లంతైన సమాచారంతో పోలీసులు సోమవారం ఉదయం రెస్క్యూ టీమ్స్ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
