ప్రభుత్వ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఎప్పటికప్పుడు కస్టమర్ల కోసం తక్కువ ధరకే అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొస్తూ ఉంటుంది. వీటి ద్వారా ఆన్ లిమిటెడ్ కాలింగ్, డేటా ఇతర బెనిఫిట్స్ ఉంటాయి. అయితే BSNL కొన్నిసార్లు లిమిటెడ్ అఫర్ కింద ప్రత్యేక ఆఫర్‌లను కూడా తీసుకొస్తుంది.
గతనెల చిల్డ్రన్స్ డే సందర్భంగా BSNL విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక 'లెర్నర్స్ ప్లాన్'ను మొదలుపెట్టింది. ఈ ప్లాన్‌తో ఫ్రీ కాలింగ్, 100GB భారీ డేటా లభిస్తుంది. అయితే ఈ చౌకైన BSNL ఆఫర్ కేవలం మరో రెండు రోజుల్లో ముగియనుంది. కాబట్టి, ఈ ప్రయోజనాలు పొందడానికి కస్టమర్లకు ఇంకో రెండు రోజులే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ప్లాన్ వివరాలు ఏంటో చూద్దాం.....
BSNL చౌకైన రూ. 251 లెర్నర్స్ ప్లాన్ వివరాలు:
BSNL ప్రకటించిన ఈ ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 251. కంపెనీ ఈ విషయాన్ని అధికారిక 'X' అకౌంట్ ద్వారా ప్రకటించింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. భారతదేశం అంతటా ఎక్కడికైనా ఆన్ లిమిటెడ్ ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఉచిత నేషనల్ రోమింగ్ కూడా ఉంది. ఇందులో ఏకంగా 100GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ముఖ్యంగా డైలీ లిమిట్ లేదు అంటే, 100GB డేటాను ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇంకా రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు వస్తాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్లాన్ ఖర్చు రోజుకు రూ.9 (రూ. 251 / 28 రోజులు) మాత్రమే.
ఆఫర్ లాస్ట్ డేట్ :
ప్రైవేట్ కంపెనీల ప్లాన్‌లతో పోలిస్తే ఈ ప్లాన్ చాలా చౌకైనది. అయితే, ఈ ఆఫర్‌కు BSNL గడువు కూడా పెట్టింది. ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవాలంటే, కస్టమర్లు తప్పనిసరిగా 13 డిసెంబర్ 2025లోపు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇతర BSNL ప్లాన్‌లు:
BSNL అన్యువల్ ప్లాన్ (365 రోజులు): BSNL అందించే 365 రోజుల ప్లాన్ ధర రూ. 2,399. ఇందులో ఆన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, ప్రతిరోజు 100 ఫ్రీ ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.
BSNL రూ.1 ఫ్రీడమ్ ప్లాన్ మళ్ళీ విడుదల: గతంలో బాగా పేరు పొందిన రూ. 1 ఫ్రీడమ్ ప్లాన్ ని మళ్లీ ప్రారంభించింది. ఈ ఆఫర్ 30 రోజుల పాటు ఉచిత కాలింగ్, డేటా ప్రయోజనాలు ఉన్నాయి.
5G సేవలు: మంచి వార్త ఏమిటంటే, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలోనే 5G సేవలను ప్రారంభించబోతోంది. మొదటగా ఢిల్లీ, ముంబై వంటి ప్రముఖ నగరాల్లో ఈ సేవలు మొదలయ్యే అవకాశం ఉంది.

