యుద్ధంలో ఊహించని ట్విస్ట్.. ఇన్నాళ్లు మిస్సైల్స్, విమానాలు, డ్రోన్లతోనే దాడులు చేస్తూ వస్తున్న ఇరాన్.. ఇప్పుడు మరో షాక్ ఇస్తోంది. తన ఆత్మాహుతి దళాలను రంగంలోకి దించింది. ఇరాక్ దేశంలోని అమెరికా ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ ఆత్మాహుతి దళాలు టార్గెట్ చేసి పేల్చివేశాయి. బాంబులతో నిండి ఉన్న ఓ పడవను.. ఆత్మాహుతి దళం.. అమెరికా ఆయిల్ ట్యాంకర్లను ఢీకొట్టి పేల్చివేశారు. ఇప్పటి వరకు యుద్ధంలో ఇదే ఫస్ట్ ఆత్మాహుతి దాడిగా చెబుతోంది అంతర్జాతీయ మీడియా.
ఇరాన్, అమెరికా సంక్షోభం మరింత ముదురుతోంది.. ఇప్పటివరకు మిస్సైల్, డ్రోన్ లతో దాడులకు దిగిన ఇరాన్.. తాజాగా ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది. ఇరాక్ లో అమెరికాకు చెందిన చమురు ట్యాంకర్ పై ఇరానియన్ ఆత్మాహుతి పడవ దాడి చేసింది. ఈ దాడిలో ఓ భారతీయుడు మృతిచెందారు. బుధవారం(మార్చి 11న) ఇరాక్ తీరానికి సమీపంలో ఈ దాడి జరిగింది.
►ALSO READ | Good News: రెండు భారత ఆయిల్ నౌకలకు.. హార్మూజ్ నుంచి గ్రీన్ సిగ్నల్..!
ఇరాక్ లోని బాస్రా సమీపంలోని ఖోర్ అల్ జుబైర్ ఓడరేవు దగ్గర అమెరికాకు చెందిన చమురు ట్యాంకర్ సఫేసియా విష్ణుపై ఇరానియన్ ఆత్మాహుతి పడవ దాడి చేసింది. ఈ నౌకలో మొత్తం 15 మంది భారతీయ సిబ్బంది ఉండగా ఒకరు ప్రాణాలు కోల్పోయారని, మిగతావారిని సురక్షితంగా రక్షించినట్లు ఇరాక్ లోని భారతీయ ఎంబసీ X లో తెలిపింది.
ఇరాక్ సముద్ర జలాల్లోని ఖోర్ అల్ జుబైర్ ఓడరేవు దగ్గర 228 మీటర్ల పొడవున్న ముడి చమురు ట్యాంకర్ సఫేసియా విష్ణును లక్ష్యంగా దాడులు చేశారు. ఈ దాడిలో పేలుడు పదార్థాలతో నిండిన ఆత్మాహుతి పడవ ఉందని వర్గాలు నివేదించాయి. ఈ ఆత్మాహుతి దాడి వ్యూహంతో ప్రపంచ షిప్పింగ్ పరిశ్రమకు తీవ్ర హెచ్చరికలను పంపింది ఇరాన్.
🚨 BREAKING: ATTACK ON US-OWNED OIL TANKER
— Mossad Commentary (@MOSSADil) March 12, 2026
The Safesea Vishnu, a U.S.-owned oil tanker, was attacked overnight near Basra, Iraq, reportedly by Iranian explosive boats.
• Vessel caught fire following the strike
• One crew member, reportedly an Indian national, was killed
•… pic.twitter.com/7HtGjN7KGB
