టెహ్రాన్: అమెరికా, ఇరాన్, ఇజ్రాయల్ యుద్ధం భీకరంగా సాగుతున్న సమయంలోనూ.. భారతీయులను గుడ్ న్యూస్. మన దేశానికి ఆయిల్ ట్యాంకర్లతో బయలుదేరిన రెండు నౌకలు.. హార్మూజ్ జల సంధి దగ్గర చిక్కుకుపోయాయి. కొన్ని రోజులు ఈ రెండు నౌకలు అక్కడే మకాం వేశాయి. యుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలోనూ.. హర్మూజ్ జల సంధి దగ్గర ఉన్న రెండు భారతీయ ఆయిల్ నౌకలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ క్రమంలోనే ఈ రెండు ఆయిల్ నౌకలు.. కొన్ని రోజుల్లో ఇండియా చేరుకోనున్నాయి.
2026, ఫిబ్రవరి, 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా మెరుపు దాడులు చేయడంతో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఇరాన్ అగ్రనాయకులు చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా మారింది. ఓ వైపు ఇజ్రాయెల్‌తో పాటు మరోవైపు పశ్చిమాసియాలో అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ కంట్రీస్‌పై ఇరాన్ విరుచుకుపడుతుంది.
ఇంకొవైపు.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసింది. హార్మూజ్ జల సంధి గుండా రాకపోకలు కొనసాగించాలంటే తమ అనుమతి తప్పక తీసుకోవాలని ఆదేశించింది. గల్ఫ్ దేశాల ప్రధాన ఆర్ధిక వనరు, ఆయువుపట్టైన ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. చేసేదేమి లేక అరబ్ కంట్రీస్ ఆయిల్ రిఫైనరీలను క్లోజ్ చేసి చమురు ఉత్పత్తి, రవాణాను నిలిపివేశాయి. హార్మూజ్ జలసంధి క్లోజ్ కావడంతో చమురు రవాణా నిలిచిపోయింది. వేలాది నౌకలు హార్మూజ్ జల సంధిలో ఎక్కడిక్కకడ చిక్కుకుపోయాయి.
►ALSO READ | గ్యాస్ లేదు.. కనీసం కిరోసిన్ అయినా పంపండి: కేంద్రానికి రేషన్ డీలర్ల రిక్వెస్ట్
దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. క్రూడాయిల్, గ్యాస్ కోసం గల్ఫ్ కంట్రీస్‌పై ఆధారపడ్డ దేశాలకు మిడిల్ ఈస్ట్ యుద్ధ సెగలు తగిలాయి. ముడి చమురు, గ్యాస్ లేక అల్లాడిపోతున్నాయి. భారత్‌పై కూడా మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. ఇండియాలో కూడా ముడి చమురు, ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ లేక దేశంలోని ప్రధాన నగరాల్లో హోటల్స్, రెస్టారెంట్లు మూసివేసే పరిస్థితి నెలకొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో కీలక చర్చలు జరిపారు. హార్మూజ్ జల సంధి గుండా ఇండియాకు వచ్చే ఆయిల్ నౌకలను అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఇరాన్.. ఇండియాకు వచ్చే షిప్‌లకు హార్మూజ్ జల సంధి గుండా ప్రయాణించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరాన్ నుంచి లైన్ క్లియర్ కావడంతో రెండు ఆయిల్ నౌకలు ఇండియాకు బయలు దేరాయి.
