దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న ఎల్పీజీ , సీఎన్జీ కొరత ఇపుడు వాహనదారులపై పడింది. సీఎన్జీతో నడిచే ఆటోలు, కార్లు ఎక్కడ చూసినా గ్యాస్ కోసం రోడ్లమీద క్యూ కట్టాయి.
హైదరాబాద్ లోని లక్డీ కాపూల్ తో పాటు పలు ప్రాంతాల్లో కారు, ఆటో డ్రైవర్లు గ్యాస్ కోసం కిలోమీటర్ల పొడవునా క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డు లోని భారత్ పెట్రోలియం బంక్ దగ్గర CNG కోసం రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
ఓలా, ఉబెర్, రాపిడో వంటి యాప్-ఆధారిత ప్లాట్‌ఫాంల ద్వారా LPG , CNG వాహనాలను నడిపే వేలాది మంది డ్రైవర్లు తమ జీవనోపాధి కోసం నిరంతరాయంగా, అందుబాటు ధరలో ఇంధనం పొందడంపై ఆధారపడి ఉన్నారు. సరఫరాలో అంతరాయం కలిగితే, ఇంధన కేంద్రాల వద్ద దీర్ఘకాలిక క్యూలు ఏర్పడుతున్నాయి, తద్వారా తక్కువ ప్రయాణాలు జరుగుతున్నాయి , ఇప్పటికే పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతో సతమతమవుతున్న డ్రైవర్లకు ఆదాయ నష్టం కలుగుతుంది.
►ALSO READ | గ్యాస్ కస్సు బుస్సు : జొమాటో, స్విగ్గీలు ఒక్కొక్కరికీ 10 వేల రూపాయలు ఇవ్వాలి.. !
సీఎన్జీ కొరత వల్ల ఆటోలు, కార్లు వారి ఆదాయం మీద ఎఫెక్ట్ పడింది. రోజూ వారి ఆదాయం కోల్పోతున్నారు. దీంతో ఆదాయం తగ్గడంతో తమ కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే తమ జీవనోపాధిపైన పడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
