ఈ ఏడాదిలో ఇప్పటికే 16 వేల మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్.. ఇప్పుడు రెండోసారి మరో 14 వేల మందిని తీసివేయబోతోందనే వార్త సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
Xలో 'టెక్ లేఆఫ్ ట్రాకర్' అనే అకౌంట్ పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. గతంలో జరిగిన 16 వేల ఉద్యోగాల తొలగింపు కేవలం మొదటి దశ మాత్రమే. కానీ కంపెనీ ఇంటర్నల్ సమాచారం ప్రకారం, Q2లో మరో 14వేల మందిని ఇంటికి పంపేందుకు అమెజాన్ ప్లాన్ చేస్తోందని పేర్కొంది.
ఈ పోస్ట్‌లో మరో షాకింగ్ విషయం ఏంటంటే AWS (Amazon Web Services) విభాగంలో మనుషులు చేసే పనులను ఇప్పుడు AI వర్క్‌ఫ్లోలు చేస్తున్నాయట. కేవలం ఇద్దరు ముగ్గురు సీనియర్ ఇంజనీర్లు ఉంటే చాలు, మిగిలిన పనినంతా AI ఏజెంట్లే చూసుకుంటున్నారని సమాచారం.
►ALSO READ | అదృష్టం అంటే వీళ్లదే.. 3 రోజుల్లో ఆదానీ గ్యాస్ షేర్లలో 35 శాతం లాభం..
ట్విస్ట్ ఏమిటంటే లేఆప్స్ చేస్తున్న ఇంజనీర్లతోనే ఈ AI సాఫ్ట్‌వేర్‌లకు శిక్షణ ఇప్పించారని... ఆ తర్వాతే వారిని తొలగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ వార్తలపై అమెజాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, గతంలో చెప్పిన దాని ప్రకారం.. అమెజాన్ మొత్తం 30 వేల మందిని తొలగించాలని ముందుగానే ప్లాన్ చేసుకుంది. అంటే ఇంకా తొలగింపులు ఉంటాయని కంపెనీకి ముందే తెలుసన్నమాట.
ఎందుకీ తొలగింపులు:
అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ గతంలోనే AI సాంకేతికత రావడం వల్ల కంపెనీలో పనులు వేగంగా జరుగుతున్నాయని, అందుకే గతంలో కంటే ఇప్పుడు తక్కువ మంది ఉంటే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల కంపెనీకి సుమారు $280 మిలియన్ల జీతాల ఖర్చు మిగులుతుందని అంచనా.
