వరుస దారుణాలతో వణికిపోతున్న లక్నో: డ్రగ్స్ కోసం తండ్రిపై కొడుకు కత్తితో దాడి..

వరుస దారుణాలతో వణికిపోతున్న లక్నో: డ్రగ్స్ కోసం తండ్రిపై కొడుకు కత్తితో దాడి..

లక్నోలో మాదకద్రవ్యాలకు బానిసైన ఒక కొడుకు, డబ్బులు ఇవ్వలేదని కన్నతండ్రిపైనే దారుణంగా దాడి చేశాడు.  బుధవారం (మార్చ్ 11) మధ్యాహ్నం సరోజినీ నగర్‌లోని బెహ్సా గ్రామంలో ఈ ఘటన జరిగింది. 35 ఏళ్ల నీరజ్ రావత్ అనే వ్యక్తి డ్రగ్స్ కొనడానికి డబ్బులు కావాలని  తండ్రి సంత్లాల్ రావత్ (60)ను అడగ్గా... తండ్రి నిరాకరించడంతో కోపంతో ఊగిపోయిన నీరజ్  కత్తితో తండ్రిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తండ్రిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా.... ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.  

 గత కొన్ని వారాలుగా లక్నోలో తండ్రీకొడుకుల మధ్య గొడవలు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి. ఫిబ్రవరి 20న అక్షత్ సింగ్ (21) అనే యువకుడు, కెరీర్ విషయంలో గొడవ జరగడంతో తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపగా...  ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఒక డ్రమ్ములో పెట్టి పారేశాడు. మరోచోట  మోహన్‌లాల్‌గంజ్‌లో ఓ 17 ఏళ్ల బాలుడు తన తండ్రిని కర్రతో కొట్టి చంపాడు. తండ్రి తాగుడుకు బానిసై ఇంట్లోని వస్తువులు అమ్మేస్తుండటంతో, గొడవ జరిగి ఈ హత్యకు దారితీసింది.