ఇంత టాలెంటెడ్‎గా ఉన్నారేంట్రా బాబూ: గ్యాస్ సిలిండర్ల ట్రక్కు ఎత్తుకెళ్లిన దొంగలు..

 ఇంత టాలెంటెడ్‎గా ఉన్నారేంట్రా బాబూ: గ్యాస్ సిలిండర్ల ట్రక్కు ఎత్తుకెళ్లిన దొంగలు..

డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు సంపాదించుకోవాలనే సూత్రం బాగా వంట పట్టించుకున్న దొంగలు.. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లపై కన్నేశారు. మార్కెట్‎లో గ్యాస్ సిలిండర్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు ఇప్పుడు.. వీటిని క్యాష్ చేసుకోవాలని భావించిన ఆ దొంగలు.. ఒకటీ అరా అయితే లాభం లేదనుకుని.. ఏకంగా గ్యాస్ సిలిండర్ల ట్రక్కునే ఎత్తుకెళ్లారు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశంలో సిట్యువేషన్ ఏంటో చెబుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. క్రూడాయిల్, ఎల్పీజీ గ్యాస్ కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడ్డ ఇండియాపైన ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్‎తో భారత్‎లో ముడి చమురు.. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ల షార్టేజ్‏తో దేశంలోని ప్రధాన నగరాల్లో హాటల్స్, రెస్టారెంట్లు మూసివేసే పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్‎లోని ఝాన్సీ జిల్లాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 500 వంట గ్యాస్ సిలిండర్లతో నిండిన ట్రక్కును ఎత్తుకెళ్లారు దొంగలు. 

ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఝాన్సీ ఎస్పీ పోలీస్ జీటీఎస్ మూర్తి వివరాల ప్రకారం..  524 భారత్ గ్యాస్ సిలిండర్లతో నిండిన ట్రక్‎ను డ్రైవర్ రాజ్ కుమార్ సిప్రి బజార్లోని తన ఇంటి బయట పార్కింగ్ చేశాడు. తెల్లారి చూసే వరకు ట్రక్ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రక్కు బారగావ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక ధాబా సమీపంలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

►ALSO READ | గ్యాస్ కస్సు బుస్సు : జొమాటో, స్విగ్గీలు ఒక్కొక్కరికీ 10 వేల రూపాయలు ఇవ్వాలి.. !

కానీ దాంట్లో ఒక్క సిలిండర్ కూడా లేదు. అంతేకాకుండా పోలీసులకు చిక్కకుండా ట్రక్ జీపీఎస్ పరికరాలను కూడా పగొలగొట్టారు దొంగలు. ఈ కేసును చాలెంజింగ్ తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం (మార్చి 11) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గ్వాలియర్ రోడ్డులోని గ్యాస్ గిడ్డంగి సమీపంలో నిందితులు జావేద్, సుమిత్, హృతిక్, అమీర్, శుభంకర్, అభిషేక్, సురేంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాతో వైరల్ కావడంతో ఇంత టాలెంట్ ఉన్నారేంట్రా బాబు బాబూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.